ఎర్రకోటలో భారీ దొంగతనం

by Muthe.Rajitha |   (  Updated:2025-09-06 07:45:03  IST  )

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణంలో భారీ దొంగతనం జరిగింది.

ఎర్రకోటలో భారీ దొంగతనం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణంలో భారీ దొంగతనం జరిగింది. ఇటీవల జైనుల మతపరమైన కార్యక్రమం 'దశలక్షణ మహాపర్వం' సందర్భంగా దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు కలశం దొంగతనం జరిగింది. ఈ కలశం 760 గ్రా. బంగారంతో తయారు చేయబడి, 150 గ్రా. వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఒక నిందితుడిని గుర్తించారు. కాగా ఈ దొంగతనంతో ఎర్రకోట భద్రతా చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story