డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు

by Ajay Maddhiboyina |

అమెరికాలో అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో రోడ్లపైకి వచ్చి నిరసనకారులు ఆందోళన చేపట్టారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, చికాగో, లాస్ ఏంజెల్స్ సహా మొత్తం 50 నగరాల్లో ఈ నిరసనలు మారుమోగాయి.

డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో రోడ్లపైకి వచ్చి నిరసనకారులు ఆందోళన చేపట్టారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, చికాగో, లాస్ ఏంజెల్స్ సహా మొత్తం 50 నగరాల్లో ఈ నిరసనలు మారుమోగాయి. అంతేకాకుండా కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, స్వీడన్, పారిస్ లోని రాయబార కార్యాలయాల బయట కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వలసల నియంత్రణ చర్యలు, యూనివర్సిటీలకు నిధులు తగ్గించడం, పలు రాష్ట్రాల్లో నేష‌న‌ల్ గార్డ్ ద‌ళాలు మోహ‌రించ‌డం లాంటి క‌ఠిన నిర్ణ‌యాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. ఇదిలా ట్రంప్ విధానాలు ఆ దేశ యువ‌త‌లో కొంత‌కాలంగా ఆగ్ర‌హ జ్వాల‌ల‌ను ర‌గిలిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే యువ‌త రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.

Next Story