పీఓకేలో పాక్ ఆర్మీపై రాళ్లదాడి..!

by Dishanational6 |
పీఓకేలో పాక్ ఆర్మీపై రాళ్లదాడి..!
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిర్పూర్ జిల్లాలోని దద్యాల్ తహశీల్ లో భారీగా నిరసనలు చెలరేగాయి. పన్నుల మోత, ఉద్యమకారుల అరెస్టులతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది.

పాకిస్థాన్ లో పెరుగుతున్న పన్నులు, నిత్యవసరాల పెంపుపై నిరసనలు చేపట్టారు స్థానికులు. దీంతో, పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలు మోహరించాయి. ఆందోళన చేపట్టిన 70 మందిని అరెస్టు చేశారు అదనపు బలగాలు. ఆందోళనకారులు భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. పాకిస్థాన్ రేంజర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్ నుండి అదనపు దళాలను మోహరించడంతో

జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రకటించిన ‘లాంగ్ మార్చ్’ను అడ్డుకునేందుకు డెబ్బై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ది డాన్ నివేదించింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ను వాడారని తెలిపింది. ఆందోళనకారులు సమీపంలోని పాఠశాలలకో వెళ్లడంతో.. చాలా మంది బాలికలకు కూడా గాయాలయ్యాయి.

జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ.. పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సమ్మె చేపట్టింది. ఒప్పందంలోని హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించింది. దీంతో, ఆందోళనలు జరిగాయి.

ముజఫరాబాద్‌లోని పోలీసులు స్థానిక నేత షౌకత్ నవాజ్ మీర్ ఇంటితో పాటు యాక్షన్ కమిటీకి చెందిన పలువురి ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఇద్దరు విద్యార్థి నాయకులతో సహా ఎనిమిది మంది కమిటీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అధిక విద్యుత్ ఛార్జీలపై ఆగస్టు 2023లో పీవోకేలో నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి కాస్తా.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతటా దావానలంలా వ్యాపించాయి. 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ఆమోదించే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి కఠినమైన షరతులు విధించింది. దీంతో పాక్ ప్రజలు ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నారు. కరెంటు ఛార్జీల పెంపు సమస్య దీనికి తోడైంది. దీంతో పాక్ ప్రజలు వీధుల్లోకి రావాల్సి వచ్చింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed