- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వరదలు.. 51 పెరిగిన మృతుల సంఖ్య
అగ్రరాజ్యం అమెరికా (America)లోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో ఆకస్మిక వరదలు (Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America)లోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో ఆకస్మిక వరదలు (Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు వర్షాలు, వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 51కి పెరిగింది. మృతుల్లో 15 మంది చిన్నారులు ఉన్నారు. మరో 27 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 850 మందిని రక్షించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్, రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. కెర్ కౌంటీలోని గ్వాడలూప్ నది ఉప్పొంగి సమీపంలోని మిస్టిక్ క్యాంప్ వేసవి శిక్షణా శిబిరాన్ని ముంచెత్తింది. దీంతో ఆ శిబిరంలోని 23 మంది అమ్మాయిలు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా గాలిస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్ల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, మరికొన్ని రోజులు భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.






