- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానిలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. సోమవారం రాజా గార్డెన్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో మొదటి అంతస్థులో ఉన్న మహాజన్ ఎలక్ట్రానిక్స్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటల కారణంగా భవనం మొత్తం దట్టమైన పొగ వ్యాపించటంతో.. షాపులో పనిచేసే ఐదుగురు సిబ్బంది అపస్మరకస్థితిలోకి వెళ్లిపోయారు. సహాయక సిబ్బంది వారికి ఆస్పత్రికి తరలించగా, నలుగురు అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






