- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు(వీడియో)
నోయిడాలోని సెక్టార్ 2 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: నోయిడాలోని సెక్టార్ 2 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) జరిగింది. శుక్రవారం ఉదయం ఓ ప్రైవేట్ కంపెనీ భవనం నుంచి ఒక్కసారిగా మంటలు, పొగలు తీవ్రంగా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంచేస్తున్నాయి. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండటంతో మొత్తం 12కు పైగా అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంత మేర నష్టం జరిగిందో, ఎవరికైనా గాయాలయినా జరిగాయా అన్న వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
కాగా, గత వారం ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని రిథాలాలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో నాలుగు అంతస్తుల భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఆ భవనంలో పలు తయారీ యూనిట్లు ఉండటంతో సుమారు 100 మంది ఫైర్ సిబ్బంది దాదాపు 15 గంటల పాటు శ్రమించారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మంటలపై పూర్తి అదుపు సాధించగలిగారు.






