- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జహంగీర్‌పుర్ స్లమ్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)
ఢిల్లీలోని జహంగీర్‌పుర్ స్లమ్ ఏరియాలో భారీగా మంటలు చేలరేగాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి సామాను తీసుకుని పరుగులు తీశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని జహంగీర్‌పుర్ స్లమ్ ఏరియాలో భారీగా మంటలు చేలరేగాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి సామాను తీసుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. 12 ఫైరింజన్లు సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి ఓ ఫైర్ అధికారి మాట్లాడుతూ.. మురికివాడల్లో అగ్నిప్రమాదం గురించి మాకు సమాచారం అందింది.
11-12 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చెత్త పడి ఉన్న బహిరంగ ప్రదేశంలో మంటలు చెలరేగినట్లు గుర్తించాము. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించాము. మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని.. , ఢిల్లీ ఫైర్ సర్వీస్ అసిస్టెంట్ డివిజనల్ అధికారి రాజీవ్ కుమార్ సిన్హా తెలిపారు.
Next Story






