- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Massive fire: 67 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం.. 3,820 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్
Massive fire: 67 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం.. 3,820 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్
by B.Srinivas |
దుబాయ్‌లోని మెరీనా ప్రాంతంలో ఉన్న 67 అంతస్తుల భవనంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: దుబాయ్‌లోని మెరీనా ప్రాంతంలో ఉన్న 67 అంతస్తుల భవనంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రజలు ఒక్కాసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే విషయం తెలుసుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ఆరు గంటల పాటు శ్రమించి భవనంలోని 764 అపార్ట్‌మెంట్‌లలో ఉన్న 3,820 మందిని రక్షించాయి. రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి ప్రతి వ్యక్తినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఆ బిల్డింగ్‌లోని నివాసితులకు అధికారులు తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు.
Next Story






