నియంత్రణ రేఖ వెంబడి భారీ అగ్నిప్రమాదం.. కమ్ముకొస్తున్న దట్టమైన పొగ

by Malleboina Mahesh |

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాల పరిధిలోని భింబర్ గలీ–బాలాకోట్ ప్రాంతాల్లో ఉన్న నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఆదివారం చెలరేగిన భారీ మంటలు విస్తృత ప్రాంతాన్ని కమ్మేశాయి.

నియంత్రణ రేఖ వెంబడి భారీ అగ్నిప్రమాదం.. కమ్ముకొస్తున్న దట్టమైన పొగ
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాల పరిధిలోని భింబర్ గలీ–బాలాకోట్ ప్రాంతాల్లో ఉన్న నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఆదివారం చెలరేగిన భారీ మంటలు (Huge fires) విస్తృత ప్రాంతాన్ని కమ్మేశాయి. పొడి అటవీ పరిస్థితులు, వర్షపాతం లేకపోవడం కారణంగా ఈ మంటలు వేగంగా వ్యాపించాయి. అడవిలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. ఈ అగ్నిప్రమాదం కారణంగా అడవుల్లో పాతిపెట్టిన ల్యాండ్‌మైన్‌లు (Landmines) పేలడంతో, సాయుధ దళాలకు భద్రతా ఆందోళనలు పెరిగాయి.

చొరబాట్లను నిరోధించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలో భాగంగా ఈ ల్యాండ్‌మైన్‌లు నియంత్రణ రేఖ (Control line)కు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. మంటల కారణంగా ఈ మైన్‌లు పేలడం భద్రతా బలగాలకు (Security forces) అదనపు ప్రమాదాన్ని సృష్టిస్తోంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఆర్మీ, స్థానిక యంత్రాంగం కృషి చేస్తున్నాయి. ఈ మంటల కారణంగా నల్లటి పొగ కమ్ముకొస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Next Story