- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Massive Explosion: గుజరాత్‌లో భారీ విస్పోటనం.. 17 మంది దుర్మరణం
భారీ పేలుడు (Massive Explosion) కారణంగా 17 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైన హృదయవిదారక ఘటన గుజరాత్ రాష్ట్రం (Gujarat State)లోని ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ పేలుడు (Massive Explosion) కారణంగా 17 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైన హృదయవిదారక ఘటన గుజరాత్ రాష్ట్రం (Gujarat State)లోని ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బనస్కాంత (Banaskantha) ప్రాంతంలోని ధున్వా రోడ్డులో ఉన్న బాణసంచా కర్మాగారం (Fireworks ఫ్యాక్టరీ)లో ఉన్నట్టుండి భారీ విస్పోటనం సంభవించింది. అయితే, ఆ పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పరిణామంతో 17 మంది కార్మికులు బిల్డింగ్ శకలాల మీద పడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






