Breaking News : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-02-09 08:43:20  IST  )

ఛత్తీస్‌గఢ్(Chatthisghad)లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్(Encounter) జరిగిన విషయం తెలిసిందే.

Breaking News : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chatthisghad)లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్(Encounter) జరిగిన విషయం తెలిసిందే. బీజపూర్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవరుజామున బీకర కాల్పులు(Firing) జరగగా.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టుల(Maoists)తోపాటు ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. భారీ సంఖ్యలో మావోలు, భద్రతా బలగాలు గాయపడ్డారు. బీజాపూర్ లోని ఇంద్రావతి నేషనల్ పార్కు(Bijapur Indravath National Park) పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భేటీ జరుగుతున్న‌ట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో.. డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా యూనిట్‌, ఎస్‌టీఎఫ్‌ కు చెందిన 3500 మంది బలగాలు యాంటీ నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.

ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 31 మంది మావోయిస్టులు అక్కడిక్కడే హతం కాగా.. ఇద్దరు సైనికులు కూడా మృతి చెందారు. అదేవిధంగా గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరగనుందని సమాచారం. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని భద్రతా బలగాల అధికారులు పేర్కొన్నారు. 31 మందిలో 18 పురుషులు, 13 మహిళలు ఉన్నారని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల ఎస్పీలు తెలిపారు. చనిపోయిన వారిలో 16 మంది మావోయిస్టులను గుర్తించామని.. ఈ 16 మంది నక్సలైట్లపై రూ. 1 కోటి 30 లక్షల రూపాయలకు పైగా రివార్డు ఉందని గుర్తించారు. మరో 15 మంది మావోయిస్టుల గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు. మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు.


Next Story