సముద్రంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6గా తీవ్రతగా నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-10 02:45:47  IST  )

ఫిలిప్పీన్స్‌ (Philippines)లోని మైండనా (Mindanao)వో ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

సముద్రంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6గా తీవ్రతగా నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిలిప్పీన్స్‌ (Philippines)లోని మైండనా (Mindanao)వో ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌లో భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. భూ ప్రకంపనలు మనాయ్ టౌన్ నుంచి సుమారు 62 కి.మీ. దూరంలో 10 కి.మీ. లోతున ఆగ్నేయ తీరం వెల్లువల్లి (Velluvalli) ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. ఫిలిప్పైన్ సీస్మాలజీ ఏజెన్సీ (PHIVOLCS) ప్రకారం.. ఈ భూకంపం తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన సునామీ రావచ్చని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తీర ప్రాంతాల్లో రాబోయే 10 గంటల్లో సాధారణ అలల కంటే రాకాసి అలలు రావొచ్చని అధికారులు తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరించారు. యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ కూడా.. భూకంప కేంద్రం నుంచి 300 కి.మీ లోపు తీరాల్లో ప్రమాదకరమైన సునామీ రావచ్చని ప్రకటించింది. ముఖ్యంగా దక్షిణ ఫిలిప్పీన్స్‌ తీర పట్టణాల్లో ప్రజలకు తమ ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

Next Story