వెనెజువెలాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-25 02:40:11  IST  )

ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి.

వెనెజువెలాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6.39 నిమిషాలకు వెనెజువెలా (Venezuela) నైరుతి ప్రాంతంలో 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఈ ప్రభావంతో భారీ భవనాలను అతాకుతలం అయ్యాయి. వెనెజువెలాలోని అనేక రాష్ట్రాలు, పొరుగు దేశమైన కొలంబియా (Colombia)లో ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు ఖాళీ చేసి బయటకు పరుగులు తీసినట్లుగా యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూకంప కేంద్రం జులియా రాష్ట్రంలోని మెనె‌గ్రాండే (Menegrande) నుంచి 24 కి.మీ తూర్పు ఈశాన్య ప్రాంతంలో, కారకాస్‌కు 600 కి.మీ‌పైగా పశ్చిమంలో 7.8 కి.మీ లోతులో భూ ప్రకంపనలు జరిగినట్లుగా యుఎస్‌జీఎస్ పేర్కొంది. అయితే, భూకంప కేంద్రమైన మెనె‌గ్రాండే అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నప్రాంతం. ఇది వెనెజువెలా (Venezuela) చమురు పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉంది. అయితే, ఈ భూ ప్రకంపనల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story