- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్సైజ్ సుంకం భారీగా తగ్గింపు.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా?
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా, దేశీయంగా ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel)పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుంచి రూ.3కు, డీజిల్‌పై లీటరుకు ఉన్న రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. ఈ క్రమంలో వినియోగదారుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే, ఎక్సైజ్ సుంకం (Excise Duty) తగ్గించినప్పటికీ, పెట్రోల్ బంకుల్లో ధరలు వెంటనే భారీగా తగ్గే అవకాశం తక్కువని నిపుణులు భావిస్తున్నారు.
నష్టాల్లో ఆయిల్ కంపెనీలు..
కొన్ని వారాలుగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా.. దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా అవే భరించాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.24, డీజిల్‌పై రూ.30 వరకు ఈ కంపెనీలు నష్టపోతున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం తగ్గించిన ఈ ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలు తమ పాత నష్టాలను పూడ్చుకోవడానికి, ధరలు మరింత పెరగకుండా అడ్డుకోవడానికి (Buffer) ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో రీటెయిల్ అవుట్‌లెట్ల (Retail Outlets)లో వినియోగదారులు కొనుగోలు చేసే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం అంతమాత్రమేనని మార్కెట్ నిపుణులు చెబతున్నారు.






