త్వరలో మార్కెట్లో మరో భారీ పతనం ‘రిచ్ డ్యాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2025-11-01 12:36:05  IST  )

మార్కెట్ల పతనంపై రాబర్డ్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో మార్కెట్లో మరో భారీ పతనం ‘రిచ్ డ్యాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ, భౌగోళిక పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులపై రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తకర రచయిత ప్రముఖ ఇన్వెస్టింగ్ గురూ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) పెట్టుబడులపై మరోసారి హెచ్చరించారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీ క్రాష్ (Market Crash) కాబోతోందని ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్నీ ఆర్థికంగా కవాచాలుగా రక్షణ కల్పించేవి వెండి, బంగారం, వంటి విలువైన లోహాలు, బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు అండగా నిలుస్తాయన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. కాగా కియోసాకి ఇలా హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2025 ఫిబ్రవరిలో కూడా ఇలాగే చరిత్రలో అతి పెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ రాబోతోందని అంచనావేశారు. కాగా రాబర్డ్ కియోసాకి పోస్టులపై కొంత మంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గత 15 ఏళ్లుగా మరో ప్రమాదం రాబోతోందని కియోసాకి అంచనా వేస్తూనే ఉన్నారని ఒక నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్ స్పందిస్తూ కియోసాకి టైమ్ లైన్‍లో చూసిన ప్రతిసారి మార్కెట్ల క్రాష్ అంటూ మాట్లాడుతారని విమర్శిస్తున్నారు.

Next Story