- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mass shooting: న్యూయార్క్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. రెస్టారెంట్‌లోకి అనేక మంది ముష్కరులు చొరబడి కాల్పులు జరిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని న్యూయార్క్ నగరం (New York city) లో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం తెల్లవారుజామున బ్రూక్లిన్‌లోని క్రౌన్ హైట్స్ రెస్టారెంట్‌లోకి అనేక మంది ముష్కరులు చొరబడి ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరస్పర వివాదం తర్వాత ఫైరింగ్ జరిగిందని న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుండి 36 షెల్స్, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు. లాంజ్ వద్ద కాల్పులు జరిగాయని కాల్స్ రావడంతో అధికారులు నిమిషాల్లోనే స్పందించారని జెస్సీకా చెప్పారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, కాల్పుల్లో పాల్గొన్న అనుమానితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు న్యూయార్క్‌లో మొత్తం 412 కాల్పుల ఘటనలు జరగడం గమనార్హం.






