పీఓకేలో మసూద్ అజార్.. నిఘా వర్గాల వెల్లడి

by Naga Rani Yarlagadda |

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో కనిపించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

పీఓకేలో మసూద్ అజార్.. నిఘా వర్గాల వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో కనిపించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. మసూద్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కన్పించినట్లు తెలిపాయి. బహవల్పూర్ బలమైన కోట నుంచి 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువదూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ నేత బిలావల్ భుట్టో ఇటీవల మసూద్ గురించి చేసిన వ్యాఖ్యల్లో.. అతను ఆఫ్ఘనిస్థాన్ లో ఉండి ఉంటాడని అన్నారు. ఒకవేళ అతను పాక్ గడ్డపై దొరికితే భారత్ కు అప్పగిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

అతను ఇటీవల స్కార్డులో.. ముఖ్యంగా సద్పారా రోడ్ ప్రాంతం చుట్టూ కనిపించినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఆ ప్రాంతంలో రెండు మసీదులు, అనుబంధ మదర్సాలు, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ గెస్ట్ హౌస్ లు ఉన్నాయి. 2016 పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019లో పుల్వామాదాడిలో 40 మంది సైనికులను బలిగొనడం వెనుక మసూద్ అజార్ హస్తం ఉంది. ఈ దాడులకు ఆయనే ప్రధాన సూత్రధారి.

Next Story