ప్రియుడితో హోటల్‌ రూంకు వెళ్లిన వివాహిత..కోర్టు సంచలన తీర్పు

by Ajay Maddhiboyina |

త‌న భార్య జూనియ‌ర్ అధికారితో అక్ర‌మ‌సంబంధం పెట్టుకుందని, అత‌డితో హెట‌ల్‌కు వెల్లిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పించాలని ఓ ఆర్మీ మేజర్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు.

ప్రియుడితో హోటల్‌ రూంకు వెళ్లిన వివాహిత..కోర్టు సంచలన తీర్పు
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌న భార్య జూనియ‌ర్ అధికారితో అక్ర‌మ‌సంబంధం పెట్టుకుందని, అత‌డితో హెట‌ల్‌కు వెల్లిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పించాలని ఓ ఆర్మీ మేజర్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. కాగా ఆ పిటిషన్‌పై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. విచారించిన అనంతరం న్యాయమూర్తి వైభవ్ ప్రతాప్ సింగ్ పిటిషన్‌ను కొట్టివేశారు. ఒక వ్యక్తి మరో వ్యక్తి భార్యను ఎత్తుకుపోయాడు అనేది పాత విషయం అని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ కోరడం అంటే మహిళ స్వతంత్రాన్ని హరించడమేనని అన్నారు. అంతే కాకుండా అది అమానవీయమైనది అని తెలిపారు.

అంతే కాకుండా ఫుటేజీ ఇప్పించేందుకు కోర్టులు దర్యాప్తు సంస్థలుగా పనిచేయవన్నారు. భార్య ఆమె ప్రియుడితో కలిసి హోటల్‌లో కలిసి ఉండే హక్కు ఉందని, అది వారి గోప్యతా ప్రాథమిక హక్కు అని తెలిపారు. ఇదిలా ఉంటే ఆర్మీ మేజర్ తన భార్య జూనియర్ అధికారితో అక్రమసంబంధం పెట్టుకుందని తనకు విడాకులు కావాలని కోర్టులో అప్లై చేసుకున్నాడు. విడాకులకు తగిన ఆధారాలు సమర్పించాలని కోర్టు కోరగా అతనివద్ద సరైన సాక్షాధారాలు లేవు. దీంతో తన భార్య ప్రియుడితో హెటల్‌కు వెళ్లిందని దానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ఇప్పించాలని పటియాలా కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ రకమైన తీర్పుని ఇచ్చింది.

Next Story