AI: మరో 18 నెలల్లో మా కోడింగ్ అంతా ఏఐ తోనే.. వారి కంటే ఏఐయే బెటర్: మార్క్ జుకర్ బర్గ్

by Prasad Jukanti |

ఏఐ వినియోగంపై మార్క్ జుకర్ బర్గ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

AI:  మరో 18 నెలల్లో మా కోడింగ్ అంతా ఏఐ తోనే.. వారి కంటే ఏఐయే  బెటర్: మార్క్ జుకర్ బర్గ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అద్భుతాలు సృష్టిస్తోంది. విద్య, వైద్యం, వ్యాపారం, వినోదం ఇలా ప్రతి రంగంలో ఏఐ వినియోగం విస్తృతంగా వ్యాపిస్తున్నది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ పై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 18 నెలల్లో తమ కంపెనీకి చెందిన కోడింగ్ ఏఐయే చేయబోతున్నదని చెప్పారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో మెటా కంపెనీ ఏఐ అంశంపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ సీఈవో మార్క్ జూకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల ఏఐ భవిష్యత్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ఏదైనా టాస్క్ ఇస్తే ఆ పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఓ టీమ్ సభ్యుడిగా తన విధులు నిర్వహిస్తోంది. త్వరలోనే టాప్ కోడర్ల కంటే ఏఐ మెరుగ్గా పని చేయడంతో పాటు బగ్ లను గుర్తిస్తూ నాణ్యతతో కూడిన కోడ్ ను స్వతంత్రంగా గాయగలదన్నారు. రానున్న 12-18 నెలల్లో తమ కంపెనీకి చెందిన లామా ప్రాజెక్టుకు సంబంధించి చాలా వరకు కోడింగ్ ను ఏఐయే పూర్తి చేయబోతున్నదని చెప్పారు.

మైక్రోసాప్ట్ లో 20-30 శాతం కోడ్ ఏఐ: సత్యనాదేళ్ల

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satyanadella) మాట్లాడుతూ తమ కంపెనీకి సంబంధించి 20-30 శాతం కోడ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే సృష్టిస్తున్నట్టు చెప్పారు. ఏఐతో కోడ్ రాయించే ప్రక్రియ రోజు రోజుకీ పెంచుతున్నట్లు చెప్పారు. కాగా గతంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ క్వాలిటీ కోసం ఏఐ ఆధారిత టూల్స్ పై ఆధారపడటం పెరుగుతున్నదని గూగుల్ తన సాప్ట్ వేర్ కోడ్ ను రూపొందించడానికి కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడుతున్నదని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story