మరోసారి ఉదృతమవుతున్న మరాఠా కోటా ఉద్యమం

by Malleboina Mahesh |

మహారష్ట్రలో మరోసారి మరాఠా కోటా డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం తమ డిమాండ్ ను ఆమోదించే వరకు ముంబైని వదిలి వెళ్ళను అని జారంగే తేల్చి చెప్పాడు.

మరోసారి ఉదృతమవుతున్న మరాఠా కోటా ఉద్యమం
X

దిశ, వెబ్ డెస్క్: మహారష్ట్రలో మరోసారి మరాఠా కోటా డిమాండ్‌ (Maratha quota demand) తెరపైకి వచ్చింది. ప్రభుత్వం తమ డిమాండ్‌ను ఆమోదించే వరకు ముంబైని వదిలి వెళ్ళను అని జారంగే తేల్చి చెప్పాడు. మరాఠా సమాజానికి రిజర్వేషన్లు కల్పించాలనే తన డిమాండ్ నెరవేరే వరకు ముంబైని వదిలి వెళ్ళనని కార్యకర్త మనోజ్ జారంగే (Manoj Jarange) ఆదివారం స్పష్టం చేశారు. తన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. తన డిమాండ్ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదని, కున్బీలు, మరాఠాలు ఒకే కులానికి చెందినవారని ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వద్ద పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు హాజరైనందున ఆ ప్రాంతం, సమీపంలోని జంక్షన్‌లలో ట్రాఫిక్ దెబ్బతింటుందని పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆయన స్థానికంగా ఉన్న మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.

Next Story