- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఈ నెల 22న భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ
ఈ నెల 22న భారత్ బంద్‌కు నక్సలైట్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు సీపీఐ (మావో) సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత పత్రికా ప్రకటన విడుదల

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఈ నెల 22న భారత్ బంద్‌కు నక్సలైట్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు సీపీఐ (మావో) సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత పత్రికా ప్రకటన విడుదల చేశారు. అణచివేత వ్యతిరేక వారోత్సవాల చివరి రోజైన 22వ బంద్ ఉంటుందని తెలిపారు. 22 నెలలుగా జార్ఖండ్‌లో విప్లవ ఉద్యమంపై కేంద్రం అనుసరిస్తున్న దౌర్జన్యానికి నిరసనగా ఈ బంద్ జరగనుందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. అందుకే దానిని పడగొట్టి కార్మికులు, రైతులు, మధ్యతరగతి మరియు జాతీయ పెట్టుబడిదారీ వర్గాల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
Next Story






