- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoists: ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టుల అరెస్ట్.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. మూడు ప్రాంతాల నుంచి వీరందరినీ అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ (Chathisgarh) లోని బీజాపూర్ (Bijapur)లో 22 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. జిల్లాలోని మూడు ప్రాంతాల నుంచి వీరందరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు గురువారం వెల్లడించారు. జిల్లాలో నిర్వహిస్తున్న నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా మంగళవారం ఉసర్ పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ (CRPF) బెటాలియన్‌కు చెందిన భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే టెక్మెట్ల గ్రామ సమీపంలోని అడవిలో ఏడుగురిని, బెల్చార్ గ్రామంలోని కోటల నుంచి ఆరుగురు నక్సలైట్లను, నెలస్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకర్కా అటవీ ప్రాంతంలో మరో తొమ్మిది మంది మావోయిస్టు సభ్యులను అరెస్ట్ చేశారు.
మావోయిస్టుల వద్ద నుంచి టిఫిన్ బాంబులు, కార్డెక్స్ వైర్, డిటోనేటర్లు, విద్యుత్ వైర్లు, బ్యాటరీలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో భద్రతా సిబ్బందికి సంబంధించిన ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. కాగా, ఈ ఏడాది ఛత్తీస్ గఢ్‌లో జరిగిన వివిధ ఎన్ కౌంటర్లలో 140 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. దీంతో తాజా పరిణామంతో మావోయిస్టులకు భారీ షాక్ తగిలినట్టు అయింది.






