Maoist Violence : చత్తీస్ గఢ్ లో 47శాతం తగ్గిన మావోయిస్టుల హింస : కేంద్రం

by Y. Venkata Narasimha Reddy |

చత్తీస్ గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టుల హింసాత్మక(Maoist violence) కార్యక్రమాలు 2010నాటితో పోలిస్తే 47శాతం తగ్గినట్లు(47 Percent Decrease)గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు

Maoist Violence : చత్తీస్ గఢ్ లో 47శాతం తగ్గిన మావోయిస్టుల హింస : కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్ : చత్తీస్ గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టుల హింసాత్మక(Maoist violence) కార్యక్రమాలు 2010నాటితో పోలిస్తే 47శాతం తగ్గినట్లు(47 Percent Decrease)గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. 2024లో మావోయిస్టుల గ్రూపుల హింసాకాండలో పౌరులు, భద్రతా సిబ్బంది మృతుల సంఖ్య కూడా 64 శాతం తగ్గినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బదులు ఇచ్చారు.

2024లో చత్తీస్ గఢ్ లో వామపక్ష తీవ్రవాదం కేసులు 267 నమోదు అయినట్లు తెలిపారు. 2010లో ఆ సంఖ్య 499గా ఉన్నట్లు వెల్లడించారు. పౌరులు, భద్రతా దళాల సంఖ్య 2010లో 343 ఉండగా, గత ఏడాది ఆ సంఖ్య 122కు తగ్గినట్లు తెలిపారు. గడిచిన అయిదేళ్లలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 1925 కోట్ల నిధుల్లో 43 శాతాన్ని అందజేసినట్లు మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్రం ప్రకటన నేపథ్యంలో చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఏరివేత ఆపరేషన్లలో భాగంగా గత ఏడాది జరిగిన వివిధ ఎన్ కౌంటర్లలో 287మంది మావోయిస్టులు చనిపోగా..ఈ ఏడాదిలో 40రోజుల్లోనే 81మంది మావోయిస్టులు మరణించడం గమనార్హం.

Next Story