Nambala Keshava Rao : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి : కేంద్ర హోంశాఖ ప్రకటన

by Muthe.Rajitha |

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) నేడు జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు కేంద్ర హోం శాఖ అధికారికంగా ప్రకటించింది.

Nambala Keshava Rao : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి : కేంద్ర హోంశాఖ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) నేడు జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు కేంద్ర హోం శాఖ అధికారికంగా ప్రకటించింది. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న బుధవారం ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని నారాయణపూర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) తన సోషల్ మీడియా ఖాతా X వేదికగా వెల్లడించారు. బుధవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు హతం అయ్యారు. వీరిలో నంబాల కేశవరావు కూడా ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఆపరేషన్ కగార్(Operation Kagar) కొనసాగిస్తామని ఇటీవలే అమిత్ షా ప్రకటించిన కొద్దిరోజుల్లోనే భారీగా నక్సల్స్ ఎన్కౌంటర్ కు గురి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

Next Story