- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ.. కీలక నేత హిడ్మా అరెస్ట్?
మావోయిస్టులకు(Maoists) మరో భారీ ఎదురుదెబ్బ తగిలిది. ఆ పార్టీ హిడ్మా(Hidma)ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టులకు(Maoists) మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిషాలో మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ నేతగా ఉన్న హిడ్మా(Hidma)ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. ఒడిషాలోని కోరాపుట్(Koraput) జిల్లాలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం అరెస్ట్ అయిన హిడ్మా ఒడిషాకు చెందిన జిల్లా కమిటీ నేత. కానీ సోషల్ మీడియాలో మాత్రం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ హిడ్మాగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన హిడ్మా ఒడిషాకు ప్రాంతానికి చెందిన వ్యక్తి మాత్రమేనని, కేంద్రకమిటీ నేత కాదని పోలీసులు సైతం పేర్కొన్నారు.
కాగా, కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులకు వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు స్వయంగా కేంద్ర హోంశాఖ అధికారికంగా ధ్రువీకరించింది. ఇది జరిగిన వారం రోజులకే కీలక నేత హిడ్మా పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






