ఆపరేషన్ కగార్‌పై సీఆర్పీఎఫ్ డీజీ కీలక వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-14 12:55:57  IST  )

ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ (CRPF DG) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.

ఆపరేషన్ కగార్‌పై సీఆర్పీఎఫ్ డీజీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ (CRPF DG) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ కగార్ (Operation Kagar)లో కర్రెగుట్టపై భారీగా ఆయుధాలు, రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్ లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ బీఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో 20 రోజుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని ఆయన నిర్థారించారు. వీరిలో 16 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. కర్రెగుట్టలో దాదాపు 450 మందుపాతర్లు, 214 బంకర్లను గుర్తించి వాటిని ధ్వంసం చేశామన్నారు. బంకర్లలో దాచిపెట్టిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బీఎస్ఎఫ్ దళాలు గతవారం ఆపరేషన్ కగార్ నిర్వహించాయి. కర్రెగుట్టల్లో ఉన్న మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ కగార్ లో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరగగా పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. అధికారికంగా 20 మంది మరణించారని చెబుతున్నా.. సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. మరోవైపు తాము శాంతి చర్చలకు సిద్ధమని, కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటూ మావోయిస్టు కేంద్రకమిటీ బుధవారం ఒక లేఖ కూడా విడుదల చేసింది. మరి కేంద్రం శాంతి చర్చలకు ఓకే చెప్తుందో, మావోయిస్టుల ఏరివేతే లక్ష్యమంటుందో తెలియాల్సి ఉంది.

Next Story