- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టుల ఎన్కౌంటర్.. శాంతి చర్చలపై కేంద్రకమిటీ సంచలన లేఖ
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమని ఓ లేఖ విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఇటీవల తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో (Karregutta) బీఎస్ఎఫ్ బలగాలు (BSF) ఆపరేషన్ కగార్ (Operation Kagar)ను నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో అనేకమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడవుల్లో (Lankapalli Forest) నిన్న 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమని ఓ లేఖ విడుదల చేశారు. తాము శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు.
ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ (Maoist Central Committee) విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ప్రభుత్వం తమతో శాంతి చర్చలకు సుముఖంగా ఉందా ? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ప్రజల సమస్యల పరిష్కారానికై ఈ శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్న మావోయిస్టు కేంద్రకమిటీ.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సానుకూలంగా స్పందించిందని తెలిపింది.
తమ పార్టీ కేంద్రకమిటీ తరఫున తాను ప్రజా సమస్యల పరిష్కారానికై కాల్పుల విరమణ ప్రకటించి, శాంతి చర్చలు జరపాలని ఏప్రిల్ 25న రెండవసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశానని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించడం ఆనందించదగిన విషయమన్నారు. దీనిపై కేంద్రం నుంచి, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యతిరేక స్పందన రావడం గమనార్హమన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, మావోయిస్టులు ఆయుధాలను వదలకుండా ఉంటే వారితో శాంతి చర్చలకు సిద్ధంగా లేమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ్ శర్మ తెలిపారన్నారు.
తాము కాల్పుల విరమణ చేస్తే మావోయిస్టులు బలపడతారని మోదీ ప్రభుత్వం, గోదీ మీడియా ప్రచారం చేస్తున్నాయని, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఏ దేశంలోనైనా ప్రజా వ్యతిరేక విధానాలే విప్లవకారులు బలపడేందుకు పునాది కల్పిస్తాయని, సమాజంలో భూమి సమస్య, ఆకలి, పేదరికం, సామాజిక, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, మహిళల సమస్యలు, దళితుల సమస్యలు, కుల సమస్య, జాతుల సమస్య, తదితర మౌలిక సమస్యలు ఉన్నంత వరకూ ఈ పునాది ఉంటుందన్నారు. ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉంటే విప్లవకారులు బలపడే అవకాశం ఉండదన్నారు. తమ పార్టీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే శాంతి చర్చలు జరిపి, సమస్యలకు సరైన పరిష్కారాలను కనుగొని ఒక ఒప్పందానికి వస్తే.. విప్లవోద్యమ ప్రాంతాల్లో రాజ్యహింసకు, మా సాయుధ పోరాటానికి పునాది లేకుండా పోతుందన్నారు. కాబట్టి తమతో శాంతి చర్చలు జరిపేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమో, కాదో స్పష్టం చేయాలని కోరారు.






