- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoist Bunker : మావోయిస్టుల బంకర్ గుర్తింపు..భద్రతా బలగాల షాక్!
చత్తీస్ గఢ్ (Chhattisgarh)సుక్మా జిల్లాలో మావోయిస్టులు భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసిన బంకర్(Maoist Bunker)ను భద్రతా బలగా(Ssecurity Forces)లు గుర్తించాయి. సుక్మా- బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని పుజారి కాంకేర్ అడవుల్లో ఎన్ కౌంటర్ అనంతరం భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా సుక్మా డీఆర్ జీ పోలీసు బలగాలు భారీ బంకర్ ను గుర్తించాయి.

దిశ, వెబ్ డెస్క్ : చత్తీస్ గఢ్ (Chhattisgarh)సుక్మా జిల్లాలో మావోయిస్టులు భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసిన బంకర్(Maoist Bunker)ను భద్రతా బలగా(Ssecurity Forces)లు గుర్తించాయి. సుక్మా- బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని పుజారి కాంకేర్ అడవుల్లో ఎన్ కౌంటర్ అనంతరం భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా సుక్మా డీఆర్ జీ పోలీసు బలగాలు భారీ బంకర్ ను గుర్తించాయి. తుమ్రేల్, తల్పేరు నదుల మధ్య ఉన్న బంకర్‌లో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే బంకర్ లో లభ్యమైన పేలుడు పదార్ధా(Explosives)లు..వాటి తయారికి ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరికరాల(Modern Technological Equipment)నుచూసిన భద్రతా బలగాలు షాక్ కు(Sshocked)గురయ్యాయి. బంకర్ లో సోరంగల్ దేశవాళి రాకెట్ లాంచర్లు, పెద్ద సంఖ్యలో బాంబుల తయారీకి వాడే యంత్రాలు, మందుగుండు సామాగ్రి, విద్యుత్తు కోసం వాడే సిల్వర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.
అధునాతన టెక్నాలజీని ఉపయోగించి బాంబులను మావోయిస్టులు తయారు చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు విస్మయం చెందారు. బాంబుల తయారీకి గాజు సీసాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. కీకారారణ్యంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి బాంబుల తయారీ చేస్తున్న మావోల సాంకేతిక పరిజ్ఞానాన్ని..పనితనాన్ని చూసిన అధికారులు ఔరా అనుకున్నారు. భద్రతా బలగాలే టార్గెట్‌గా దాడులు చేసేందుకు మావోయిస్టులు రకరకాల బాంబులను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు.
కాగా చత్తీస్ గఢ్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కగార్(2026) చేపట్టిన భద్రతా బలగాలు అబూజ్ మడ్ అడవుల్లో మావోల ఏరివేతకు భారీ కార్యాచరణ ఆపరేషన చేపట్టబోతున్నట్లుగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించడం సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ సహా ఇతర కమిటీలన్ని చత్తీస్ గఢ్ దండకారణ్యం కేంద్రంగా పనిచేస్తుండటం..పీఎల్ జీఏ దళాలు కూడా అక్కడే ఉండటంతో భద్రత బలగాల భారీ అపరేషన్ మావోయిస్టులకు సంకటంగా మారింది.
ఇక్కడే కర్రిగుట్ట ప్రాంతంలో తెలంగాణ మావోయిస్టుల కమిటీలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పుజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ క్రమంలో ముందెన్నడు లేని రీతిలో దాదాపుగా 3,500మంది భద్రతా బలగాలు సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లోని అడవులను జల్లెడ పడుతూ ముందుకెలుతున్నాయి. ఈ నేపథ్యంలో మునుముందు మరిన్ని ఎన్ కౌంటర్లు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది.






