Maoist Attack: CRPF క్యాంప్‌పై మావోయిస్టుల దాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు

by Kema Shiva Kumar |

ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్‌ (Bijapur)లో భద్రతా బలగాలపై మావోయిస్టులు (Maoists) దాడికి తెగబడ్డారు.

Maoist Attack: CRPF క్యాంప్‌పై మావోయిస్టుల దాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్‌ (Bijapur)లో భద్రతా బలగాలపై మావోయిస్టులు (Maoists) దాడికి తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. జీడిపల్లి (Jeedipally)లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపు (CRPF Camp)‌పై మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు మోత మోగించారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగి వారి దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. సుమారు గంట పాటు జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తలించారు. కాల్పులు జరిపిన మావోయిస్టుల కోసం భద్రతా సిబ్బంది అడవిలో జల్లెడ పడుతున్నారు.

Next Story