Mansarovar Yatra: కైలాస మానసరోవర్ యాత్ర ప్రారంభం.. తొలి బ్యాచ్‌లో 39 మంది యాత్రికులు

by B.Srinivas |

ఐదేళ్ల విరామం తర్వాత కైలాస్ మానసరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. యాత్ర కోసం ఘజియాబాద్ నుంచి 39 మంది యాత్రికుల మొదటి బృందం బయలుదేరింది.

Mansarovar Yatra: కైలాస మానసరోవర్ యాత్ర ప్రారంభం.. తొలి బ్యాచ్‌లో 39 మంది యాత్రికులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐదేళ్ల విరామం తర్వాత కైలాస్ మానసరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra) మళ్లీ ప్రారంభమైంది. యాత్ర కోసం ఆదివారం ఘజియాబాద్ నుంచి 39 మంది యాత్రికుల మొదటి బృందం బయలుదేరింది. యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ (Jaiveer singh) యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. 39 మంది యాత్రికులతో పాటు, మొదటి బ్యాచ్‌లో ఇద్దరు అనుసంధాన అధికారులు కూడా ఉంటారు. మొదటగా 46 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా, కొందరు ఆనారోగ్య కారణాలతో రద్దు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. యాత్ర పునఃప్రారంభం చారిత్రాత్మకమైందని, ఇది మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తుందని మంత్రి జైవీర్ తెలిపారు. కాగా, కొవిడ్ మహమ్మారి కారణంగా 2020 నుంచి యాత్రను నిలిపివేసిన విషయం తెలిసిందే.

Next Story