- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాక్!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టును సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టును సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మద్యం కేసులో సీబీఐ అరెస్ట్‌పై స్టే ఇవ్వాలని సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఢిల్లీలో ఉన్నంత మాత్రన నేరుగా సుప్రీంకోర్టుకే రావటమేనా అని మండిపడింది.
అనేక అవకాశాలు ఉన్నప్పటికీ నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. ఈ అంశంలో హైకోర్టును ఆశ్రయించాలని సూచించించింది. ఈ కేసులో సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేయగా నిన్న ఐదు రోజుల పాటు అతడిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. తన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో మనీష్ సిసోడియా ఉన్నట్టు తెలుస్తోంది.






