ఆయుధాలు అప్పగించిన మైతేయి గ్రూప్

by Ajay Maddhiboyina |

ఆయుధాలను ట్రక్కులు, పికన్ వ్యాన్లలో వేసుకొని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆయుధాలు అప్పగించిన మైతేయి గ్రూప్
X

- ట్రక్కులు, పికప్ వ్యాన్లలో ఆయుధాలు

- గవర్నర్‌ను కలిసిన రాడికల్ ప్రతినిధులు

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో శాంతి స్థాపనకు తీసుకుంటున్న చర్యలు నెమ్మదిగా ఫలిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత రాష్ట్రంలో అక్రమాయుధాలు కలిగిన రాడికల్ గ్రూపులు, ప్రజలు వెంటనే వాటిని అప్పగించాలని రాష్ట్రపతి అజయ్ కుమార్ భల్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 'అరంబై టెంగోల్' అనే విప్లవ మైతేయీ గ్రూపు సభ్యులు గురువారం తమ ఆయుధాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రెండు జాతుల హింసను అంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా.. ఇప్పటి వరకు దోచుకున్న, చట్ట విరుద్దంగా కలిగి ఉన్న ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని ఏడు రోజుల్లోగా స్వచ్చంధంగా అప్పగించాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కోరిన నేపథ్యంలోనే ఈ ఆయుధాల అప్పగింత జరిగింది. ఆయుధాలను ట్రక్కులు, పికన్ వ్యాన్లలో వేసుకొని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే మంగళవారం అరంబై టెంగోల్ గ్రూప్ ఆయుధాల అప్పగింతకు పలు నిబంధనలు, షరతులు విధించింది. వాటికి ఒప్పుకున్న తర్వాతే ఆయుధాలను అప్పగిస్తామని చెప్పింది. ఈ మేరకు రాడికల్ గ్రూప్ ప్రతినిధులు గవర్నర్ అజయ్ కుమార్‌ను కూడా కలిశారు. అయితే ఆ షరతులు ఏమిటో మాత్రం పేర్కొనలేదు. కాగా, మయన్మార్ సరిహద్దుకు కంచె వేయాలని, 1951ని కటాఫ్ డేట్‌గా ఉంచి జాతీయ పౌర రిజిస్టర్‌ను అమలు చేయాలని, అక్రమ వలసదారులను బహిష్కరించాలనే పలు నిబంధనలు గవర్నర్‌కు సమర్పించిన మెమోరాండంలో ఉన్నట్లు తెలిసింది.

Next Story