- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Manipur violence: మణిపూర్‌లో మరోసారి హింస..ఇళ్లను తగులబెట్టిన దుండగులు
దిశ, నేషనల్ బ్యూరో: మైతీ, హ్మార్ కమ్యూనిటీల ప్రతినిధుల మధ్య శాంతి ఒప్పందం జరిగిన 24 గంటల్లోనే మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్‌లోని లాల్పాని గ్రామంలో మిలిటెంట్లు అనేక సార్లు కాల్పులకు తెగపడటంతో పాటు, పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. అయితే ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లాల్పానీలో మైతీ వర్గానికి చెందిన వ్యక్తుల ఇళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలో హింస చెలరేగడంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపుచర్యలు చేపట్టారు.
కాగా, అసోంలోని కాచర్‌కు సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో మైతీ, హ్మార్ కమ్యూనిటీల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇరు సంస్థలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. జిల్లాలో పరిస్థితిని సాధారణీకరించడంతో పాలు హింసాత్మక ఘటనలను అరికట్టాలని ఇరు సంఘాలు నిర్ణయించుకున్నాయి. భద్రతా బలగాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. తదుపరి భేటీ ఆగస్టు 15న చేపట్టనున్నట్టు తెలిపాయి. ఈ సమావేశానికి జిరిబామ్ జిల్లా యంత్రాంగం, అస్సాం రైఫిల్స్, సీఆర్‌ఫీఎఫ్ మధ్యవర్తిత్వం వహించాయి. జిల్లాకు చెందిన పలు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఒప్పందం జరిగిన 24గంటల్లోనే హింస చోటుచేసుకోవడం గమనార్హం.