- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manipur: మణిపూర్‌లో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి.. పలువురి మిస్సింగ్!
మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో 11 మంది కుకీ మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లా (Jiribalm distric)లో 11 మంది కుకీ మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. మంగళవారం ఉదయం ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జకురాధోర్ కరోంగ్ ప్రాంతంలో శిథిలాల కింద మృత దేహాలను గుర్తించారు. వారిని మైతీ కమ్యూనిటీకి చెందిన వారిగా గుర్తించారు. అలాగే జిరిబామ్ జిల్లాలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. తప్పిపోయిన వ్యక్తుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీస్ అధికారి ముయివా తెలిపారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిరిబామ్ జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. మరోవైపు అనుమానిత మిలిటెంట్లను చంపినందుకు నిరసనగా కొండ ప్రాంతాల్లోని కుకీ-జో ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మంగళవారం బంద్ పాటించారు. అయితే కనిపించకుండా పోయిన వారిని మిటిటెంట్లు కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.






