చరిత్ర సృష్టించిన మణిక విశ్వకర్మ.. మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2025 కిరీటం కైవసం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-19 03:08:42  IST  )

మిస్ యూనివర్స్ ఇండియా-2025 కిరీటాన్ని మణికా విశ్వకర్మ (Manika Vishwakarma) సొంతం చేసుకుంది.

చరిత్ర సృష్టించిన మణిక విశ్వకర్మ.. మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2025 కిరీటం కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్: మిస్ యూనివర్స్ ఇండియా-2025 కిరీటాన్ని మణికా విశ్వకర్మ (Manika Vishwakarma) సొంతం చేసుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌ (Jaipur) వేదికగా జరిగిన ఈ పోటీల్లో దేశంలోని అందగత్తెలతో పాటు ఇతర దేశాల వారు కూడా పాల్గొన్నారు. ఇక ఈ పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్య‌శర్మ ఫస్ట్‌ రన్నరప్‌గా, మోహక్ థింగ్రా సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. హర్యానా అమ్మాయి అమిషి కౌశిక్‌ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

రాజస్థాన్‌లోని గంగానగర్‌ (Ganga Nagar) ప్రాంతానికి చెందిన మణికా విశ్వకర్మ ప్రస్తుతం ఢిల్లీలో మోడలింగ్ చేస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా-2025 టైటిల్‌ను గెలుచుకున్న ఆమె 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతోంది. అంతకు ముందు మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 కిరీటాన్ని కూడా తన సొంతం చేసుకుంది. అనంతరం ఢిల్లీలో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మిస్ యూనివర్స్ ఇండియా-2025 టైటిల్ కూడా నెగ్గడంతో ఆమెపై మరింత బాధ్యత పెరిగింది. ఈ ఏడాది చివర్లో థాయ్‌లాండ్‌ (Thailand) వేదికగా జరగబోతున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మిస్ యూనివర్స్ పోటీలో 130 దేశాల నుండి అందగత్తెలు పాల్గొనబోతున్నారు.

Next Story