ఎయిర్‌బస్ A320 సిరీస్‌కు తప్పనిసరి మార్పులు..విమాన భద్రతపై డీజీసీఏ కీలక ఆదేశాలు

by Malleboina Mahesh |

ఎయిర్‌బస్ A320 విమానాల్లో సోలార్ రేడియేషన్ ప్రభావం తో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ డేటా కరప్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఎయిర్‌బస్ హెచ్చరికలు జారీ చేస్తూ రీకాల్ ప్రకటించింది.

ఎయిర్‌బస్ A320 సిరీస్‌కు తప్పనిసరి మార్పులు..విమాన భద్రతపై డీజీసీఏ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎయిర్‌బస్ A320 విమానాల్లో సోలార్ రేడియేషన్ ప్రభావం తో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ డేటా కరప్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఎయిర్‌బస్ (Airbus) హెచ్చరికలు జారీ చేస్తూ రీకాల్ ప్రకటించింది. ఈ హఠాత్పరిణామంతో భారత్‌లో ఇండిగో, ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన విమానయాన సంస్థల సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), విమాన భద్రతను పటిష్టం చేసే దిశగా కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎయిర్‌బస్ A318, A319, A320, A321 రకం విమానాల కోసం డీజీసీఏ తప్పనిసరి భద్రతా డైరెక్టివ్‌ (Mandatory Safety Directive)ను విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న దాని ప్రకారం, "కింద పేర్కొన్న అంశంపై తనిఖీ, మార్పు (Modification) తప్పనిసరి. ఈ తప్పనిసరి మార్పులు/వర్తించే ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్‌లకు అనుగుణంగా లేని పక్షంలో, ఆ ఉత్పత్తి (విమానం) వర్తించే పరిధిలో ఉన్న దేనినీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఆపరేట్ చేయకూడదని DGCA స్పష్టం చేసింది. కాగా ఈ ఆదేశాలు దేశీయ విమానయాన సంస్థలు తమ ఎయిర్‌బస్ A320 సిరీస్ విమానాలలో నిర్దేశిత భద్రతా ప్రమాణాలను వెంటనే అమలు చేయడాన్ని తప్పనిసరి చేస్తుంది.

Next Story