- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే గూండాయిజం.. ట్రైన్‌లో సీటు ఇవ్వలేదని రక్తం వచ్చేలా పిడిగుద్దులు.. చెప్పుతో కొట్టి.. (వీడియో)
అధికారం ఉంది కదా అని రెచ్చిపోవడం రాజకీయ నాయకులకు కామన్ అయిపోయింది. ఎన్నికలకు ముందు జనాలను దేవుళ్లుగా చూసే వారే ఎన్నికల తర్వాత పనికి రాని వాళ్లుగా, చీప్‌గా చూడటం అలవాటైంది. వీళ్లతో ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది.

దిశ, వెబ్‌సైట్ : అధికారం ఉంది కదా అని రెచ్చిపోవడం రాజకీయ నాయకులకు కామన్ అయిపోయింది. ఎన్నికలకు ముందు జనాలను దేవుళ్లుగా చూసే వారే ఎన్నికల తర్వాత పనికి రాని వాళ్లుగా, చీప్‌గా చూడటం అలవాటైంది. వీళ్లతో ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. ఝాన్సీలోని బబీనా నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరిచ్ఛా కూడా ఇలాంటి నాయకుడే. వందే భారత్ ట్రైన్‌లో సీటు ఇవ్వలేదని ఓ వ్యక్తిని అనుచరులతో కొట్టించాడు. రక్తం కళ్ల చూసే దాకా వదల్లేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం.
ఈ నెల 19న న్యూ ఢిల్లీ–భోపాల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ వద్ద ఈ హింసాత్మక ఘటన జరిగింది. ఈ ఘటనలో 50 ఏళ్ల ప్రయాణికుడు రాజ్ ప్రకాశ్‌పై దాదాపు 10 మంది వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ వ్యక్తులు బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరిచ్ఛా మద్దతుదారులుగా భావిస్తున్నారు. కాగా ఎమ్మెల్యే తన భార్య కమలీ సింగ్, కుమారుడు శ్రేయాంశ్ సింగ్‌తో కలిసి ఢిల్లీ నుంచి E-2 కోచ్‌లో బయలుదేరారు. ఎమ్మెల్యేకు సీటు 8, భార్యకు 50, కుమారుడికి 51 సీట్లు కేటాయించారు. బాధితుడు రాజ్ ప్రకాశ్ సీటు 49 (విండో సీటు)లో కూర్చున్నాడు.
అయితే ఎమ్మెల్యే తన కుటుంబంతో కలిసి కూర్చునేందుకు రాజ్ ప్రకాశ్‌ను తన సీటును మార్చుకోమని కోరినట్లు తెలుస్తోంది. కానీ వైద్య కారణాల వల్ల ఇందుకు తిరస్కరించాడు బాధితుడు. దీంతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రైలు సాయంత్రం 6:53 గంటలకు ఝాన్సీ స్టేషన్‌లో ఆగగానే.. దాదాపు పది మంది వ్యక్తులు కోచ్‌లోకి ప్రవేశించి రాజ్ ప్రకాశ్‌పై దారుణంగా దాడి చేశారు. చెంపదెబ్బలు, పిడిగుద్దులు, కాలితో తన్నడం, చెప్పులతో కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఈ దాడితో బాధితుడి ముక్కు విరిగి, నోరు, చెవుల నుంచి రక్తస్రావం జరిగింది. అక్కడ పోలీసులు ఉన్నా జోక్యం చేసుకోలేదని సాక్షులు ఆరోపిస్తున్నారు. ఇక భోపాల్‌లోని రాణీ కమలాపతి స్టేషన్‌లో దిగిన రాజ్ ప్రకాశ్.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP)ను కలిసినట్లు సమాచారం. దాడి సమయంలో అతని బ్యాగ్ కూడా దొంగిలించబడినట్లు తెలుస్తోంది.






