- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TMC ఓటమి : 15 ఏళ్ల తర్వాత శపథాన్ని వీడి జుట్టు కత్తిరించుకున్న వ్యక్తి !
టీఎంసీ ఓడిపోయేంతవరకూ తాను జుట్టు కత్తిరించుకోనని శపథం చేసిన వ్యక్తి.. తాజాగా గుండు గీయించుకున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఓటమిపాలవ్వడంతో.. తన శపథాన్ని వీడాడు.

దిశ, వెబ్‌డెస్క్: టీఎంసీ ఓడిపోయేంతవరకూ తాను జుట్టు కత్తిరించుకోనని శపథం చేసిన వ్యక్తి.. తాజాగా గుండు గీయించుకున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఓటమిపాలవ్వడంతో.. తన శపథాన్ని వీడాడు. ఈ ఘటన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సహా.. దేశంలో చర్చనీయాంశమైంది. కూచ్ బెహార్ జిల్లాలోని బామన్ పారా గ్రామానికి చెందిన బానేశ్వర్ బర్మన్ అనే ఈ వ్యక్తి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధికారంలో ఉన్నంత కాలం తన జుట్టును కత్తిరించుకోబోనని 2011లో బానేశ్వర్ బర్మన్ శపథం చేశారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు కోరుకుంటూ ఆయన చేసిన ఈ వింత నిరసన గత దశాబ్దన్నర కాలంగా కొనసాగుతూనే ఉంది. వృత్తిరీత్యా ఇటుక బట్టీల్లో పని చేసే వలస కూలీ అయిన బర్మన్, బీజేపీ మద్దతుదారుడిగా ఆ ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఇంతకాలం తన జుట్టును పనిలో ఇబ్బంది కలగకుండా ముడివేసుకుని మేనేజ్ చేస్తూ వచ్చారు.
ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 100 సీట్ల మార్కును దాటి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీంతో తన పంతం నెరవేరిందని బర్మన్ భావించారు. మే 4న అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు టీవీ స్క్రీన్‌కే అతుక్కుపోయిన ఆయన, తన అభిమాన పార్టీ గణనీయమైన స్థానాలు సాధించడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. "టీఎంసీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను సెలూన్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు రాష్ట్రంలో మార్పు మొదలైంది, అందుకే నా నిరసనను ముగిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం గ్రామస్తులు, బంధువుల సమక్షంలో బానేశ్వర్ బర్మన్ గుండు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులకు ‘మురి’ పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. తన ప్రాంతంలో గత 15 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని, తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం రాజకీయ మార్పు అవసరమని తాను బలంగా నమ్మానని బర్మన్ ఈ సందర్భంగా వివరించారు. "ఇకపై కొత్త జుట్టు పెరుగుతుంది, నా ఇష్టం వచ్చినప్పుడు కత్తిరించుకుంటాను" అంటూ ఆయన చిరునవ్వుతో చెప్పడం అందరినీ నవ్వించింది.






