ఆ గ్రామంలో నరభక్షక చిరుత హతం

by Malleboina Mahesh |

అడవి నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత గ్రామాల్లోని ప్రజలపై దాడులు చేసింది. గత వారం రోజులుగా ఆ చిరుత దాడులు చేయడంతో అటవీ అధికారులు దానిని నరభక్షక చిరుతగా ప్రకటించారు.

ఆ గ్రామంలో నరభక్షక చిరుత హతం
X

దిశ, వెబ్ డెస్క్: అడవి నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత గ్రామాల్లోని ప్రజలపై దాడులు చేసింది. గత వారం రోజులుగా ఆ చిరుత దాడులు చేయడంతో అటవీ అధికారులు దానిని నరభక్షక చిరుత ప్రకటించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లా, గజాల్డ్ (Gajald) గ్రామంలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా భయభ్రాంతులకు గురిచేసిన నరభక్షక చిరుతపులిని ఎట్టకేలకు స్థానికులతో కలిసి అధికారులు హతమార్చారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన అటవీ శాఖ... ప్రత్యేక వేటగాళ్ల బృందాన్ని రంగంలోకి దించింది. ఈ బృందం విస్తృతమైన నిఘా, పర్యవేక్షణ, తీవ్రమైన ఆపరేషన్ నిర్వహించిన అనంతరం, చిరుతను విజయవంతంగా మట్టుబెట్టింది. చిరుత హతం కావడంతో గ్రామంలో భయాందోళనలు తొలగి, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ప్రభావిత ప్రాంతంలో నిఘా, పెట్రోలింగ్‌ను పటిష్టం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతకు, వారి ప్రాణాలను రక్షించడానికి పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Next Story