UP Man Died : ప్రాణం తీసిన ‘పాన్’.. అసలేం జరిగిందంటే..?

by Sathputhe Rajesh |

పాన్ ఉమ్మి వేస్తుండగా ప్రమాదవశాత్తుగా బస్సులో నుంచి పడి రామ్ జైవాన్(45) అనే వ్యక్తి మృతి చెందాడు.

UP Man Died : ప్రాణం తీసిన ‘పాన్’.. అసలేం జరిగిందంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో : పాన్ ఉమ్మి వేస్తుండగా ప్రమాదవశాత్తుగా బస్సులో నుంచి పడి రామ్ జైవాన్(45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన యూపీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘యూపీ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఏసీ బస్సు శనివారం లక్నో నుంచి అజమ్‌గర్‌కు బయలుదేరింది. బస్సు ఉదయం 10.30 గంటల సమయంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపైకి చేరుకుంది. బిహి గ్రామ సమీపం వద్దకు బస్సు చేరుకోగానే పాన్ ఉమ్మేసేందుకు వ్యక్తి బస్సు డోర్‌ను తీశాడు. దీంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోయాడు. బస్సును వెంటనే ఆపిన డ్రైవర్ యూపీ ఎక్స్‌ప్రెస్ ఇండ్రస్ట్రీయల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న యూపీఈఐడీఏ అధికారులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story