ప్యాంట్ మీద సూసైడ్ నోట్‌ రాసి భర్త ఆత్మహత్య.. బంధించి భార్య, పోలీసుల టార్చర్.. డబ్బులు మొత్తం లాగేసి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌లోని ఫర్రుఖాబాద్ జిల్లాకు చెందిన దిలీప్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్యాంట్ మీద సూసైడ్ నోట్ రాసి.. ఆ తర్వాత చనిపోయాడు. ఇందుకు కారణం భార్య, ఆమె కుటుంబం, పోలీసులు చేస్తున్న టార్చర్ అని పూర్తిగా నోట్‌లో వివరించాడు.

ప్యాంట్ మీద సూసైడ్ నోట్‌ రాసి భర్త ఆత్మహత్య.. బంధించి భార్య, పోలీసుల టార్చర్.. డబ్బులు మొత్తం లాగేసి..
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఫర్రుఖాబాద్ జిల్లాకు చెందిన దిలీప్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్యాంట్ మీద సూసైడ్ నోట్ రాసి.. ఆ తర్వాత చనిపోయాడు. ఇందుకు కారణం భార్య, ఆమె కుటుంబం, పోలీసులు చేస్తున్న టార్చర్ అని పూర్తిగా నోట్‌లో వివరించాడు. రాజపుత్ భార్య ఫిర్యాదు మీద కానిస్టేబుళ్లు యశ్వంత్ యాదవ్, మహేష్ ఉపాధ్యాయ్‌ రూ. 50,000 డిమాండ్ చేశారని.. శారీరకంగా వేధించిన తర్వాత రూ. 40,000 తీసుకున్నారని ఆరోపించాడు. భార్య తండ్రి, సోదరుడు, బావమరిది కూడా అతనిని శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించాడు. ఈ సంఘటనకు ముందు.. మద్యం సేవించి తనను కొట్టాడని భార్య ఆరోపించడంతో అరెస్ట్ చేశారు పోలీసులు.

కాగా ఈ కేసు స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. బంధువులు, స్థానికులు శవాన్ని పోలీసులు ముట్టుకోవద్దని నిరసనకు దిగారు. బాధితుడి ఆరోపణలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఫర్రుఖాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్తి సింగ్.. స్టేషన్‌లో రెండు పక్షాల మధ్య రాజీ కుదిరిందని, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో గాయాలు లేవని తెలిపారు. కాగా ప్యాంట్‌పై సూసైడ్ నోట్ రాయడమనేది.. సాక్ష్యాలు లేకుండా చేస్తారనే భయం కావొచ్చని అంటున్నారు నిపుణులు.





Next Story