- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి.. ఆకాష్ సిస్టం సృష్టికర్త భావోద్వేగం
పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్స్‌ను ఆకాష్ వ్యవస్థ కూల్చేసింది. దీన్ని సృష్టించిన ప్రహ్లాద రామారావు ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్‌ను కూల్చివేయడంలో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కీలకపాత్ర పోషించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఆకాష్ వ్యవస్థ వెనుక డీఆర్‌డీవో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద రామారావు 15 ఏళ్ల కృషి ఉంది. ఆకాష్ సిస్టం అభివృద్ధి చేసిన టీంలోకి రామారావును స్వయంగా భారత ‘మిసైల్ మ్యాన్’ ఏపీజే అబ్దుల్ కలాం ఎంపిక చేశారు. ప్రస్తుతం 78 ఏళ్ల ఆయన.. ఈ ప్రాజెక్టు చేపట్టిన బృందంలో అత్యంత చిన్న వయసు వాడు కావడం గమనార్హం.
ఇప్పుడు పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్స్‌ను ఆకాష్ వ్యవస్థ తుత్తునియలు చేసిందని తెలియడం సంతోషంగా ఉందని డాక్టర్ ప్రహ్లాద రామారావు అన్నారు. ‘నా బిడ్డ ఇంత కచ్చితంగా, అందంగా శత్రులక్ష్యాలను ఛేదించడం చూశా. నిజంగా ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. ఇంత అద్భుతంగా ఆకాష్ సిస్టం పనిచేయడం చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.






