- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి చేసుకొమ్మన్నందుకు యువతిపై దాడి
మధ్యప్రదేశ్‌లో రేవా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

X
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రేవా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకొమ్మని అడిగిన యువతిని యువకుడు చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. 24 ఏళ్ల పంకజ్ త్రిపాఠి ఓ యువతి ప్రేమించుకున్నారు. యువతి పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఒప్పుకోలేదు. యువతి పదే పదే అడగడంతో ఆమెను కిందపడేసి కాలుతో ఇష్టం వచ్చినట్లు తన్నాడు. ఈ దాడిలో యువతి స్పృహ కోల్పోయింది. యువకుడు మౌగంజ్ ప్రాంతంలోని ధేరా గ్రామానికి చెందినట్లుగా గుర్తించారు. అంతకుముందు పోలీసులు త్రిపాఠిని అరెస్ట్ చేశారు. అయితే యువతి కేసు నమోదుకు నిరాకరించడంతో వదిలేశారు. అయితే తాజాగా వీడియో ఆధారంగా అతనిపై మరోసారి కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి : రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్యకు కారణం ఇదే
Next Story






