విడాకులు వచ్చాయని.. 40 లీటర్ల పాలతో స్నానం.. వీడియో వైరల్!

by Phanindra |   (  Updated:2025-07-13 17:36:55  IST  )

భార్యతో విడాకులు వచ్చాయని ఒక భర్త తెగ సంతోషించాడు. నాలుగు బకెట్లలో పాలు తెచ్చుకొని ఇంటి ముందే వాటితో స్నానం చేశాడు.

విడాకులు వచ్చాయని.. 40 లీటర్ల పాలతో స్నానం.. వీడియో వైరల్!
X

దిశ, నేషనల్ బ్యూరో: అస్సాంకు చెందిన మానిక్ అలీ అనే వ్యక్తి విడాకులను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తనకు స్వేచ్ఛ లభించిందంటూ పాలతో స్నానం చేశాడు. నాల్బరి జిల్లాకు చెందిన మానిక్ అలీ.. తన భార్య ప్రియుడితో పలుమార్లు లేచిపోయిందని, కానీ కుటుంబం కోసం తను సైలెంట్‌గా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత విడాకుల కోసం ప్రయత్నించగా.. లాయర్ ఫోన్ చేసి డైవర్స్ ఫైనల్ అయినట్లు చెప్పాడని, అందుకే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నానని వెల్లడించారు. మొత్తం నాలుగు బకెట్లలో 40 లీటర్ల పాలు తీసుకొచ్చిన అలీ.. ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని బకెట్లలోని పాలతో స్నానం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో లింక్

Next Story