- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: బాత్ రూమ్ నుండి కోర్టు లైవ్ విచారణకు హాజరు.. వీడియో వైరల్
గుజరాత్ హైకోర్టు విచారణ సందర్భంగా వెరైటీ ఘటన చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కోర్టుల్లో క్రమశిక్షణను న్యాయమూర్తులు చాలా సీరియస్ గా తీసుకుంటుంటారు. కోర్టుకు వచ్చే వారి డ్రెస్సింగ్ విధానంతో పాటు మాట తీరు, ప్రవర్తనలో ఏ మాత్రం తేడా ఉన్న గట్టిగానే మందలిస్తారు. అలాంటిది ఓ వ్యక్తి బాత్ రూమ్ నుంచి కోర్టు విచారణకు వర్చువల్ గా హాజరు కావడం వైరల్ గా మారింది. గుజరాత్ హైకోర్టులో (Gujarat High Court) న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ నిర్జర్ దేశాయ్ (Justice Nirzar S Desai) జూన్ 20న ఓ పిటిషన్ పై వాదనలు వింటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బాత్ రూమ్ లో నుండి విచారణకు హాజరైన వ్యక్తే ఈ కేసులో ఫిర్యాదు దారుడు కావడం గమనార్హం. తనపై నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ వర్చువల్ గా జరిగింది. ఆ సమయంలో జూమ్ కాల్ లో 'సమద్ బ్యాటరీ' (Samad Battery) అనే ఐడీ కలిగిన ఓ వ్యక్తి టాయిలెట్ సీటు మీద బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ధరించి విచారణలో పాల్గొన్నాడు. ఓ వైపు న్యాయమూర్తి వాదనలు వింటుంటే మరో వైపు ఆ వ్యక్తి తన ఫోన్ వీడియో ఆన్ లోనే ఉంచి బాత్ రూమ్ లో తన పని కానిచ్చేశాడు. ఫోన్ నేలపై ఉంచి శుభ్రం చేసుకుని మరో గదిలోకి వచ్చి విచారణలో కొనసాగాడు. తాను వీడియో మోడ్ ఆఫ్ చేశాననుకుని ఇదంతా చేశాడా లేక ఉద్దేశపూర్వకంగానే ఇది చేశాడో తెలియనప్పటికీ ఇందతా లైవ్ లో స్ట్రీమ్ అయింది. నిజానికి కోర్టు విచారణ సమయంలో ఇలాంటి వ్యవహారాలను న్యాయమూర్తులు ఉపేక్షించరు. గత మార్చిలో ఓ వ్యక్తి లావెటరీ నుంచి కోర్టు వచారణకు హాజరు కాగా ఆగ్రహించిన జడ్జి సదరు వ్యక్తికి రూ. 2 లక్షల జరిమానా, కోర్టు ప్రాంగణం శుభ్రం చేయాలని శిక్ష విధించారు. గత ఫిబ్రవరిలో బెడ్ పై పడుకుని విచారణలో పాల్గొన్న వ్యక్తికి రూ. 25 వేలు జరిమానా విధించారు. 2020 లో ఓ అడ్వొకేట్ విచారణ సమయంలో సిగరెట్ తాగుతూ కనిపించడంపై జడ్జి ఆగ్రహించారు.






