స్నానం చేస్తున్న యువతిని రహస్యంగా చిత్రీకరించే ప్రయత్నం.. యువకుడు అరెస్ట్

by Ramesh Naini |

బెంగళూరు నగరంలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన రేకెత్తించే ఘటన చోటుచేసుకుంది.

స్నానం చేస్తున్న యువతిని రహస్యంగా చిత్రీకరించే ప్రయత్నం.. యువకుడు అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు నగరంలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన రేకెత్తించే ఘటన చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల యువతి తన ఇంట్లో స్నానం చేస్తుండగా, ఓ వ్యక్తి రహస్యంగా తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీయడానికి ప్రయత్నించిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ప్రకారం.. ఈ ఘటన ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 9:30 నుంచి 9:40 గంటల మధ్య మహాదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని గరుడాచార్యపాళ్య ప్రాంతంలో జరిగింది. బాధితురాలు తన నివాసంలోని బాత్రూంలో స్నానం చేస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి మొబైల్ ఫోన్‌తో వీడియో రికార్డ్ చేయడం గమనించింది. వెంటనే అప్రమత్తమైన యువతి భయంతో గట్టిగా కేకలు వేయడంతో, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన బాధితురాలు.. అనంతరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా..

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు గతంలో కూడా ఇలాంటి అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story