- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాగిన మైకంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. అమెరికా ఫ్లైట్ లో ఘటన
by Javid Pasha |
తాగిన మైకంలో ఓ ఇండియన్ ప్యాసెంజర్ తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జనకు పాల్పడిన ఘటన అమెరికా విమానంలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: తాగిన మైకంలో ఓ ఇండియన్ ప్యాసెంజర్ తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జనకు పాల్పడిన ఘటన అమెరికా విమానంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ AA 292లో ఆదివారం జరిగింది. న్యూ యార్క్ నుంచి న్యూ ఢిల్లీకి వస్తున్న విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితుడి నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన ఫ్లైట్ సిబ్బంది.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే నిందితుడి అక్కడి సిబ్బందికి అప్పజెప్పారు. అనంతరం అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






