Mamatha: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పహెల్గాం ఉగ్రదాడి.. సీఎం మమతా బెనర్జీ

by B.Srinivas |

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పహెల్గాం ఉగ్రదాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Mamatha: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పహెల్గాం ఉగ్రదాడి.. సీఎం మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పహెల్గాం ఉగ్రదాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) ఆరోపించారు. సాయుధ దళాల ధైర్య సాహసాలను సైతం కేంద్రం రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశ ప్రజలకు భద్రత కల్పించడంలో బీజేపీ తీవ్రంగా విఫలమైందన్నారు. మంగళవారం ఆమె రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించారు. పహెల్గాం టెర్రర్ అటాక్ (Terror attack) కేంద్ర ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యపు ఫలితమని అభివర్ణించారు. దాడి జరిగిన ప్రదేశంలో భద్రతా సిబ్బంది ఎందుకు లేరని ప్రశ్నించారు. భద్రత కల్పించడంలో విఫలమైందున ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? వారికి ఆయుధాలు ఎలా వచ్చాయి? ఇంకా ఎవరినీ ఎందుకు పట్టుకోలేదు? అని ప్రశ్నించారు.

ఉగ్రవాదానికి మతం లేదని, దానిని ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. టెర్రరిస్టులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సాయుధ దళాల ధైర్యసాహసాలకు మేము సెల్యూట్ చేస్తామని తెలిపారు. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణ జరిగిన సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం కలిగిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో సాయుధ దళాలను ప్రశంసిస్తూ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

Next Story