- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mamatha benarjee: ఈసీకి సీఎం మమతా బెనర్జీ వార్నింగ్.. ఎందుకంటే?
నకిలీ ఓటర్లను చేర్చుకోవడం ద్వారా మాత్రమే బీజేపీ విజయం సాధించిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా, గుజరాత్‌ల నుంచి నకిలీ ఓటర్లను చేర్చుకోవడం ద్వారా మాత్రమే బీజేపీ మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీకి సహాయం చేస్తోందని, అందుకే ఇతర రాష్ట్రాల ఓటర్లను లిస్టులో కలుపుతున్నారని విమర్శించారు. కోల్‌కతాలో గురువారం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈసీ సహకారంతో బీజేపీ ఇతర రాష్ట్రాల ఓటర్లను తమ ఓటర్ల జాబితాలో చేర్చుతోందని తెలిపారు. ఈసీ దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, నకిలీ ఓటర్లను తొలగించాలని లేదంటే ఈసీ ఆఫీస్ ఎదుట నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
‘ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగితే బెంగాల్ ఎన్నికల్లో గెలవలేమని బీజేపీకి తెలుసు. అందుకే హర్యానా, గుజరాత్‌ల నుంచి నకిలీ ఓటర్లను తీసుకొచ్చి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. నకిలీ ఓటర్లను తమ పార్టీ గుర్తిస్తుందని, బయటి వ్యక్తులు బెంగాల్‌ను తాము అనుమతించబోమని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీల్లో పక్క రాష్ట్రాల ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ప్రతిపక్షాలు ఈ వాస్తవాలను గ్రహించలేదని చెప్పారు. వచ్చే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను 215 సీట్లకు పైగా టీఎంసీ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ చొరబాట్ల గురించి మాట్లాడుతుందని, కానీ దేశ పౌరులను అమెరికా నుంచి గొలుసుల కట్టేసి పంపిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.






