Mamatha: బెంగాలీలపై దాడులు ఆపాలి.. మమతా బెనర్జీ వార్నింగ్

by B.Srinivas |

దేశ వ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వారిని చిత్ర హింసలు పెడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Mamatha: బెంగాలీలపై దాడులు ఆపాలి.. మమతా బెనర్జీ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వారిని చిత్ర హింసలు పెడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాల్ వలస కార్మికులను లక్ష్యం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చరించారు. కోల్‌కతాలో బుధవారం నిర్వహించిన మార్చ్‌లో మమతా బెనర్జీ మాట్లాడారు. బెంగాలీ వలసదారులను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆపాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.

బెంగాలీ మాట్లాడే ప్రజలను వేధించడానికి, చిన్న అనుమానం వచ్చినా వారిని నిర్బంధించడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో 1000 మందిని ఇప్పటికే నిర్భంధంలో ఉంచారని తెలిపారు. బెంగాలీ మాట్లాడే వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పశ్చిమ బెంగాల్ భారత్ లో లేదా? ఆ రాష్ట్రం ఇండియాలో భాగం కాదా? బెంగాళీలపై ద్వేషం ఎందుకు? అని ప్రశ్నించారు. దాదాపు 22 లక్షల మంది బెంగాల్ వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్నారని, వారికి ఎటువంటి అవమానం జరిగినా సహించబోనని తేల్చి చెప్పారు.

Next Story